![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 లో వైల్డ్ కార్డ్స్ రాకముందు కంటే వచ్చిన తర్వాత చాలా మార్పులొచ్చాయి. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో హౌస్ లో గందరగోళంగా ఉంది. వాళ్లు చేసే చేష్టలకి చిరాకు వచ్చిందనడంలో ఆశ్చర్యం లేదు. ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా.. నాగార్జున వచ్చి అందరికి చివాట్లు పెడుతాడా అని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. అనుకున్నదే అయింది.. వీకెండ్ వచ్చిరాగానే నాగార్జున అందరికి గట్టిగానే క్లాస్ తీసుకున్నాడు.
వైల్డ్ కార్డ్స్ కి ఇచ్చిన పవర్స్ కి వాళ్ళు అర్హులో కాదో అని మిగతా కంటెస్టెంట్స్ లో ఇద్దరి ఒపీనియన్ తీసుకొని వాళ్ళ ఒపీనియన్ బట్టి ఆడియన్స్ పోలింగ్ ద్వారా పవర్స్ ని ఉంచాలో తొలగించాలో డిసైడ్ చేసారు. మాధురికి ఎలిమినేషన్ నుండి సేవ్ అయ్యే పవర్ కి తను అర్హురాలో కాదోనని ఓల్డ్ కంటెస్టెంట్స్ లో సంజనని అడుగగా తను అర్హురాలని చెప్తుంది. దివ్య కాదని చెప్తుంది. ఆడియన్స్ కూడా దివ్యకి సపోర్ట్ చెయ్యడం తో మాధురి పవర్ తొలగించబడుతుంది.
పవన్, మాధురి కిచెన్ దగ్గర గొడవని నాగార్జున వీడియో ప్లే చేసి చూపిస్తాడు. అందులో మాధురి తప్పు ఉంటుంది. నీ ఇంటెన్షన్ కరెక్టే కానీ నువ్వు చెప్పే విధానం తప్పని నాగార్జున చెప్తాడు. నాకు అలా చెప్పే అలవాటు లేదు సర్ నాది అంతా కమాండింగే ఉంటుంది.. రిక్వెస్ట్ ఉండదని మాధురి పొగరుగా సమాధానం చెప్తుంది. అదే మార్చుకుంటే ఎంతో ఎత్తుకి వెళ్తావని నాగార్జున సలహా ఇస్తాడు. రాబోయే వారాల్లోనైనా మాధురి మాటతీరులో మార్పు వస్తుందేమో చూడాలి మరి.
![]() |
![]() |